గుంటూరు : ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లో ఎలుక కళేబరం దర్శనమిచ్చింది. ఈ ఘటన గుంటూరు తెనాలిలో వెలుగు చూసింది. ఓ మహిళ షాపులో ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ను కొనుగోలు చేసింది. అయితే ఇంటికెళ్లి చూసే సరికి ఆయిల్ ప్యాకెట్ లో ఎలుక కళేభరం బయటపడింది. దీంతో అవాక్కై అయిన మహిళ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయిల్ ప్యాకెట్లు కొనుగోలు చేయాలంటేనే జనం జంకుతున్నారు. నకిలీ ప్యాకెట్ గా అనుమానిస్తున్నారు. ఫుడ్ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యం.. స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో థమ్సప్ బాటిల్ లో బల్లులు, పాముల కళేభరాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఎముకలతోపాటు పలు జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ను నూనేలో కలిపి విక్రయించడం గమనార్హంం.
No comments:
Post a Comment